Sunday, January 19, 2025

రెఫరెండం అన్నావు.. ఇప్పుడేం చెబుతావు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తన పాలనే పార్లమెంటు ఎన్నికలకు రిఫరండం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతావని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో 14 ఎంపిలు గెలుస్తామని, అందుకు తన పాలనే రిఫరండం అంటూ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కేవలం ఎనిమిది స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైందని అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బిజెపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల ఫలితాలు తన పాలనకు రెఫరెండం

అని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఏం సమాధానం చెబుతావని నిలదీశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. ఆరు గ్యారంటీల్లో ఒకటి తప్ప మిగిలినవి ఏమీ అమలు చేయలేదని అందుకే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని అన్నారు. 14 స్థానాల్లో గెలుస్తామని చెప్పి కేవలం ఎనిమిదితోనే సరిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పనితీరు, దేశంలో జరిగిన అభివృద్ధి పట్ల ప్రజలు బిజెపికి ఆకర్షితులై ఓట్లు వేశారని గుర్తు చేశారు.

అంతేకాని బిఆర్‌ఎస్‌తో బిజెపి కుమ్మక్కు కావడం వల్ల బిఆర్‌ఎస్ ఓట్లు పడ్డాయని చేసేది అసత్య ప్రచారం తప్ప ప్రచారం తప్ప మరేమి లేదని అన్నారు. ఆరు నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరు ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా చేసిన వాగ్ధానాలు నిలబెట్టుకోలేదనే ఉద్దేశ్యంతో బిజెపికి 8 స్థానాలను కట్టాబెట్టారని గుర్తు చేశారు. బిజెపి చరిత్రలో అత్యధికంగా తెలంగాణ ప్రాంతంలో 8 లోక్ సభ సీట్లు సాధించుకుందని, ఇది తమ పార్టీ ప్రజలపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఇన్ని స్థానాల్లో మునుపెన్నడూ బిజెపి గెలవలేదని, ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో తమ అభ్యర్థులు గెలిచారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News