Thursday, December 19, 2024

ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే.. సిఎం రేవంత్ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తాను గుజరాత్ కు గులాం కాదు.. భారతీయులకు మాత్రమే గులామ్ నని అన్నారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిఆర్ఎస్ లపై విమర్శలు చేశారు. “నేను ప్రజాసమస్యలపై మాట్లాడితే.. సిఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దాడి చేస్తున్న విమర్శిస్తున్నారు. నేను గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని.. నేను ఎవరికీ గులామ్ ను కాదన్నారు.మీరు ఇటలీ గులాంలు.. నకిలీ గాంధీ కుటుంబానికి గులాంలు” అని కిషన్ రెడ్డి ఫైరయ్యారు.

గత పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందే..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా.. రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News