Friday, April 4, 2025

కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది..?:కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి తర్వాత మరచిపోయారని అన్నారు. ప్రజల నుంచి ముఖ్యంగా బీసీల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో మరో గత్యంతరం లేక 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ఆమోదించారు తప్పితే, బీసీల బాగు కోరి కాదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమం కోసం ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బడ్జెట్‌లలోనూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 46 శాతం అని చెబుతున్నప్పుడు మీ మంత్రివర్గంలో 46 శాతం బీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు.

సగానికి పైగా ఉన్న బీసీలకు మీరిచ్చిన మంత్రి పదవులు రెండంటే రెండేనని, దీనిని బట్టే తెలుస్తుంది బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉందోనని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. బీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగబద్ధతను కల్పించింది మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. మోదీ విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లించే రాజకీయ కుట్రలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News