Sunday, January 19, 2025

రైతులను మోసం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సన్నవడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో కిషన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దొడ్డు వడ్లను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట మార్చి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 80శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని.. దొడ్డు వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉందని చెప్పారు. రబీ కింద 75 లక్షల ధాన్యం సేకరించాలని ఒప్పందం కుదుర్చుకుందన్నారు. డిసెంబర్ 9నే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News