Monday, December 23, 2024

తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కెటిఆర్‌: కిషన్ రెడ్డి కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కెటిఆర్ అని.. మాకు ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి మోస్ట్ అన్‌ఫిట్ లీడర్ అని ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ..ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులవి చేతకాని ఆలోచనలు, అర్థంలేని ప్రశ్నలు మండిపడ్డారు.

తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కెటిఆర్ అని, మేం సాధారణ కార్యకర్తల స్థాయి నుండి పైకి వచ్చి పనిచేసేవాళ్లమని.. మాకు ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కెటిఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను సరిగ్గా పరిపాలన చేయలేని దద్దమ్మలని, ఇంట్లో కూర్చుని ట్వీట్ చేసే వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News