- Advertisement -
కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గట్టిగా జవాబిచ్చారు. కనీస మద్దతు ధరపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదని చురకలంటించారు. మద్దతు ధరపై మొసలి కన్నీళ్లు వద్దని సెటైర్ వేశారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయలేమని 2013లో పార్లమెంట్ సాక్షిగా మీరే చెప్పారని, సభలో చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు రూ.15 వేల ఆర్థిక సహాయం, వరికి రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల క్షేమానికి కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. సభను తప్పుదారి పట్టించవద్దని రాహుల్ గాంధీపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
- Advertisement -