Monday, December 23, 2024

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేపర్ల మీదే.. భూమి మీద ఉండవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేపర్ల మీదే ఉంటాయి తప్ప.. భూమి మీద ఉండవు కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరాపార్క్ వద్ద బిజెపి పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని 2017లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారని.. అయినా ఇప్పటివరకు రెండు పడకల గదులు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రగతి భవన్ ను 4 నెలల్లోనే కట్టుకున్నారని, కొత్త సచివాలయాన్ని 8 నెలల్లో నిర్మించారని.. పేద ప్రజలకు మాత్రం ఇళ్లు కట్టడానికి ఏళ్లు పడుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News