Monday, December 23, 2024

తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ప్రధాని సంకల్పం: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః తెలంగాణలో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజల తరుపున స్వాగతం. దేశంలో 14వ వందే భారత్ రైలును ప్రారంభించుకున్నాం. 14 వందే భారత్ రైల్లో రెండు తెలుగు రాష్ట్రాలకే వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి.

ప్రతి కుటుంబం వెంకటేశ్వర స్వామి దర్శనం కోరుకుంటోంది. వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం వందే భారత్ రైలు అందించారు. రూ.7864 కోట్లతో జాతీయ రహదారులు చేపడుతున్నాం. రాష్ట్రంలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసందానం. రూ.1366 కోట్లతో బిబినగర్ ఎయిమ్స్‌లో కొత్త భవనం నిర్మాణం. ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రధాని మోడీ అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ప్రధాని మోడీ సంకల్పం అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News