కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతికి రాష్ట్ర బిజెపి పగ్గాలు
మూడోసారి సారథ్య బాధ్యతలు అనుభవానికి
పెద్దపీట రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ
చైర్మన్‌గా ఈటల ఎపికి పురంధేశ్వరి, జార్ఖండ్‌కు
బాబూలాల్ మరాండీ, పంజాబ్‌కు సునీల్ జాకఢ్,
రాజస్థాన్‌కు షెకావత్ నియామకం
మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు రా ష్ట్రాల్లో సంస్థాగతంగా కీలక మార్పులు చేసిం ది. బిజెపి తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ప్రధానంగా ఉ భయ తెలుగు రా ష్ట్రాలతో వివిధ రా ష్ట్రాల్లో మార్పులు జరిగాయి. తెలంగాణలో బండి సంజయ్, ఎపిలో సో ము వీర్రాజును పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన బిజెపి అధిష్టానం.. వా రి స్థానంలో కిషన్‌రెడ్డి, పురందేశ్వరిలను నియమించింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎపి బిజెపి అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షు డు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణ మే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలో బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌గా బాధ్యతలు అప్పగించా రు.మాజీ సిఎం కిరణ్ కుమార్‌రెడ్డిని బిజెపి జా తీయ ఎగ్జిక్యూటివ్ కమి టీ సభ్యుడిగా ఎం పిక చేశారు. వీరితో పాటు ఝార్ఖండ్ బిజెపి అధ్యక్షుడిగా మాజీ సిఎం బాబూలాల్ మరాండీ, పంజాబ్ బిజెపి అధ్యక్షుడిగా సునీల్ జాక్కడ్, రాజస్థాన్‌లో గజేంద్రసింగ్ షెకావత్‌ను నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం బండి సంజయ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత కొద్ది సేపటికే త్వరలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
కిషన్‌రెడ్డి ప్రస్థానం…
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో స్వామిరెడ్డి. ఆండాళమ్మ దంపతులకు 1960లో జన్మించిన కిషన్ రెడ్డి డిప్లొమా వరకు చదువుకున్నారు. 1977లో జనతాపార్టీలో ద్వా రా రాజకీయాల్లోకి వచ్చిన ‘కిషన్‌రెడ్డి 1980లో బిజెపి స్థాపించిన తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చా రు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కిషన్ రెడ్డి. 2010 నుంచి 2014 వరకు బిజెపి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014 నుంచి 2016 వరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యే గా. సికింద్రాబాద్ నుంచి ఎంపిగా సేవలందించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవి చూసిన కిషన్‌రెడ్డి. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదాలో పనిచేస్తున్నారు.2016- నుంచి -18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. బిజెపి అధిషా ్టనం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు.
పురందేశ్వరి ఇలా…
దగ్గుబాటి పురందేశ్వరి 1959 ఏప్రిల్ 22న జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురందేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి.. 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. యూపిఎ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఎపి విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లో పురందేశ్వరి బిజెపిలో చేరారు. పార్టీ మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బిజెపి ఒడిశా రాష్ట్ర బాధ్యురాలిగా ఉన్న పురందేశ్వరికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
బిజెపి గెలుపు.. ప్రజలకు లాభం : ఈటల
తనపై విశ్వాసంతో రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మం గళవారం ఈటల మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ అంతరంగం, సమస్యలు పూర్తిగా తెలిసిన వాడిని. ము ఖ్యమంత్రి కెసిఆర్ బలం, బలహీనతపై అవగాహన ఉ న్నోడిని. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతను సం పూర్ణంగా నిర్వహిస్తా. కిషన్‌రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనతో కలిసి పని చేస్తా. బిఆర్‌ఎస్‌ను ఓడించడం బిజెపితోనే సాధ్యం. బండి సంజయ్ నేతృత్వంలో నాలుగు ఎన్నికలు గెలిచాం. రాష్ట్రంలో గెలిస్తే బిజెపి.. లేదంటే బిఆర్‌ఎస్ గెలిచాయి. రాష్ట్రంలో కాం గ్రెస్ ఏ ఎన్నికనూ గెలవలేదు. బిఆర్‌ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభం. బిజెపి గెలిస్తే ప్రజలకు లాభం.‘ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తనపై వి శ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీకీ, నడ్డా, అమిత్ షా, సంతోష్‌జీ, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.