Saturday, December 28, 2024

కేంద్రం కీలక నిర్ణయం.. ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీని వల్ల రోడ్లు ఎలివేటెడ్ కారిడార్లు, సొరంగాలు వంటి ప్రజా పనులు ట్రాఫిక్ సజావుగా ఉండేలా నిర్మించబడతాయి. దీంతో కంటోన్మెంట్‌ నుంచి రెండు వైపుల నిర్మాణాలకు లైన్‌ క్లియర్ అయింది. జాతీయ రహదారి, NH-44 నిజామాబాద్ వైపు, రాష్ట్ర రహదారి, SH-1 కరీంనగర్ వైపు రెండు ప్రయాణికులు ఫలితంగా ప్రయోజనం పొందుతారు.

భూమిని కేటాయించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ కు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రక్షణ శాఖ భూమిని రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వడం సంతోషకరమన్నారు. 175 ఎకరాలను రాష్ట్రప్రభుత్వానికి బదిలీ చేయడం సంతోషం అన్నారు. ప్రజాస్వామ్యం కోసమే సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూముల బదిలీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయం వల్ల మౌలికవసతులు పెరుతాయని ఆయన వెల్లడించారు. కేంద్ర ఇచ్చిన భూముల్లో ఎలివేటెడ్ కారిడార్లు, టన్నెళ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News