Monday, January 20, 2025

బాధితులను మోడీ ప్రభుత్వం ఆదుకుంటుంది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: వరద బాధితులను మోడీ ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. మోరంచపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడంతో బాధితులను పరామర్శించారు. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెనను కిషన్ రెడ్డి పరిశీలించారు.  కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. జాతీయ విపత్తు కింద కెసిఆర్ ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలియజేశారు. ఆ నిధులతో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. కేంద్ర బృందాలు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నాయన్నారు.  రాజకీయాలకు అతీతంగా అంతా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: అంబర్ పేటలో తండ్రిని చంపిన కూతురు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News