Friday, December 20, 2024

చెప్పుకోండి చూద్దాం..

- Advertisement -
- Advertisement -

మహైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎంఎల్‌ఎ ఎవ రో చెప్పుకోండి చూద్దాం? అని కెటిఆర్ చురకలంటిస్తూ ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పు లు మోసే బిజెపి సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు అని స్పష్టం చేశారు. మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పను లు చెయ్యండి అంటూ సూచించారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన మిలియన్ మార్చ్‌ను నిర్వహించి నేటికి పుష్కరకాలం గడిచింది అని కిషన్‌రెడ్డ్డి పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ అనేక నిర్బంధాలను, అడ్డంకులను, అరెస్టులను అధిగమించి లక్షలాదిమంది ప్రజలతో నిర్వహించిన నాటి మిలియన్ మార్చ్ నేటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంది అని చేసిన కిషన్‌రెడ్డి ట్వీట్‌కు కెటిఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News