- Advertisement -
హైదరాబాద్: ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే.. గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులు స్వాగతం పలటం సంప్రదాయమని..కానీ, మాజీ సీఎం కెసిఆర్.. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం బిజెపి పార్టీ కార్యాలయంలో ‘అభివృద్ధి భారతానికి మోడీ గ్యారంటీ’ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం పిఎంవో కార్యాలయం ఆహ్వానాలు పంపిందని తెలిపారు. ప్రధాని వస్తే.. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులు స్వాగతం పలటం సంప్రదాయమన్నారు. మాజీ సీఎం కెసిఆర్.. ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. తెలంగాణ పర్యటన సందర్భంగా మార్చి 4న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీకి సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారని భావిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.
- Advertisement -