Thursday, January 23, 2025

పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి రూపకల్పన: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Kishan Reddy visit Tirumala Temple

తిరుపతి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మెక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను కిషన్ రెడ్డికి అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లడుతూ..”శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది. టిటిడి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ళుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజిక కార్యక్రమాలు చేస్తోంది. పేదలకు వైద్య, విద్యా, అనేక సామాజిక బస్తీల్లో దేవాలయ నిర్మాణం, దేవాలయాల అభివృద్ధికి టిటిడి సహకరిస్తుంది. జమ్మూలో కూడా టిటిడి దేవస్ధానం ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. గోవుల ఆధారంగా అనేక రకాల ఉత్పత్తులు చేపట్టడం, గోవుల సంరక్షణకు టిటిడి చర్యలు చేపడుతుంది. టిటిడి చర్యల కారణంగా ప్రజలు కూడా గోవు అంటే రక్షణ భావం ఏర్పడింది. కరోనా కారణంగా టూరిజం వ్యవస్ధ బాగా నష్ట పోయింది. మళ్ళీ పుంజుకుంటున్న సమయంలో‌ ధర్డ్ వేవ్ మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భారత దేశంలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి రూపకల్పన చేసింది. అనేక రకాల టూరిజం అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నాం. దేశంలో‌ కరోనా తగ్గు ముఖం‌ పడుతున్న నేపధ్యంలో డెమోస్టిక్ టూరిజం‌ గానీ, ఇంటర్నేషనల్ టూరిజం గానీ పునరుద్దరణ చేస్తాం. దేశంలో 15 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రతి ఒక్కరు పర్యటించాలని ప్రధాని‌ పిలుపునిచ్చారు” అని పేర్కొన్నారు.

Kishan Reddy visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News