Thursday, January 23, 2025

తెలంగాణ ఎటు పోతుందో అర్థమైతలేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేవలం డబుల్‌ బెడ్‌రూంలను చూడడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మాగమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గురువారం డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావుతో కలిసి బాటసింగారం వెళ్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూంలను చూడకుండా అడ్డుకుని, ఆకారణంగా కార్యకర్తలను పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్, బోధనలో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఎటు పోతుందో తెలంగాణ అర్థం కావడం లేదు. నియంతృత్వ దోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News