ఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. మంత్రి పదవి ఖాయం అనుకున్న నేతలు ప్రధాని నివాసానికి చేరుకుంటున్నారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదా ఇస్తే శాఖ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి ఎంపిలు భూపేందర్ యాదవ్, మీనాక్షి లేఖి, నారాయణ రాణే, ప్రీతమ్ ముండే, అను ప్రియా, అనురాగ్ ఠాకూర్, సునీల్, దుగ్గుల్, శోభ కరందలాబే, అజయ్‌భట్, జ్యోతిరాధిత్య, సోనోవాల్, కపిల్ పాటిల్‌లు ప్రధాని మోడీని కలిశారు. అనురాగ్ ఠాకూర్‌కు స్వతంత్ర హోదాతో పాటు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కేంద్రమంత్రి పదవులకు సంతోష్ గాంగ్వర్, రమేశ్ ఫోక్రియాల్, సదానందగౌడ్ రాజీనామా చేశారు. మంత్రుల్లో 27 మంది ఒబిసిలు ఉండే అవకాశం ఉంది. ఒబిసిలో ఐదుగురికి కేబినెట్ లో అవకాశం దక్కనుంది.