- Advertisement -
హైదరాబాద్ ః తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కేంద్ర పర్యటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి లేఖ రాశారు. సాంకేతిక, భూపరీక్షల సహా అన్ని అనుమతులున్న ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎయిర్ వేస్ అనుసంధానత కోసం అభివృద్ధిపరంగా అవసరమైన ఏర్పాట్లను చేసి ఇవ్వాలని కోరారు. గతంలో విమానయాన శాఖ మంత్రి లేఖ రాసినా, తాను లేఖ రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
- Advertisement -