Friday, December 20, 2024

కిషన్‌రెడ్డిది లక్కీ హ్యాండ్ : అర్వింద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి బిజెపికి లక్కీ హ్యాండ్ అని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ కొనియాడారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమర్థుల సారథ్యంలో బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తెస్తామని వెల్లడించారు. బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని, ఎన్నికల కమిటీ నిర్వాహక ఛైర్మన్‌గా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లను నియమించిన సందర్భంగా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డాకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.- 2024లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్ గా వెళ్తారని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బండి సంజయ్ తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News