Monday, January 20, 2025

సిఎం కెసిఆర్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తే సిఎం కెసిఆర్ ప్రధానిని కూడా కలవటం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి మహబూబ్ నగర్ లో నిర్వహించిన ప్రజాగర్జన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సిఎం కెసిఆర్ వైఖరి తో తెలంగాణ నష్టపోతుందన్నారు. 9ఏళ్లల్లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ. 9 లక్షల కోట్లు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారా చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు అని కిషన్ రెడ్డి తెలిపారు. సమ్మక్క-సారక్క దేవతలను కోట్లాది ప్రజలు పూజిస్తారన్నారు. సమ్మక్క- సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారక్క పేరు పెట్టుకోవడం సంతోషకరం అని ఆయన వెల్లడించారు., రాష్ట్ర పసుపు రైతులు పసుపు కోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతుల కోసం మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని మోడీ కి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పసుపు రైతుల దశాబ్దాల నాటి కలను ప్రధాని సాకారం చేస్తున్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికి అన్నిరాష్ట్రాలకు నిధులు ఇస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికి ప్రధాని కార్యక్రామానికి సిఎంలు వస్తారు. తెలంగాణ సిఎం మాత్రం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావడం లేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News