Thursday, November 14, 2024

జపాన్ నూతన ప్రధానిగా ప్యుమియో కిషిదా

- Advertisement -
- Advertisement -

Japan new PM Kishida

టోక్యో: జపాన్ ప్రస్తుత ప్రధాని యోషిహిడే సుగా పదవి నుండి తప్పుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపికను చేపట్టారు. ఇందులో జపాన్ మాజీ విదేశాంగ మంత్రి ప్యుషియో కిషిదా నెగ్గారు. వచ్చే వారం ఆయన జపాన్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

ప్రస్తుత జపాన్ ప్రధాని యోషిహిడే సుగా ఏడాది గడవక ముందే పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. మరోసారి బాధ్యతలు చేపట్టనని కూడా తెలిపారు. ప్రజాదరణ కోల్పోయిన సుగా పార్టీ నేతగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్‌డిపి) నూత నాయకుడిని ఎన్నుకునేందుకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. ఇందులో అనేక మంది పోటీ చేసినప్పటికీ ప్యుమియో కిషిదాకే భారీ మద్దతు లభించింది.

జపాన్ లో షింజో అబే చాలా కాలం ప్రధానిగా పనిచేశారు. అయితే  ఆయన తన అనారోగ్య కారణంగా గత ఏడాది ఆగస్టులో పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో యోషిహిడే సుగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన పదవిని స్వీకరించినప్పటి నుంచి కోవిడ్ మహమ్మారి, ఒలింపిక్ క్రీడల నిర్వహణ వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నారు. దీంతో ప్రజల్లో ఆయనపట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఏడాది కాలంలోనే ఆయన పనితీరు రేటింగ్ 30 శాతానికి తగ్గిపోయినట్లు తాజా సర్వేలో వెల్లడయింది. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో  ప్యుమియో కిషిదా   ఎన్నికయ్యారు. ఆయన సంస్థాగత ఎన్నికల్లో వ్యాక్సినేషన్ మంత్రి టారో కోనోను ఓడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News