- Advertisement -
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కిష్టాపురం ఎస్సి గురుకులంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి సాయివర్ధన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోటు ఎటువంటిది లభించలేదని పోలీసులు వెల్లడించారు. సాయివర్థన్ స్వస్థలం ముదిగొండ అని పోలీసులు తెలిపారు. సోమవారం సదరు విద్యార్థి ఇంటి నుంచి కళాశాలకు వచ్చినట్టు సమాచారం. గతంలో సంగారెడ్డి మండలం కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో స్వాతి అనే విద్యార్థిని గత నెలలో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. గురుకులాల్లో రోజుకో సంఘటన బయటకు వస్తోంది. పలు గురుకులాల్లో భోజనం చేసిన తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గతంలో గురుకులాల్లో విద్యార్థులను పాములు కాటేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
- Advertisement -