Tuesday, January 7, 2025

హైదరాబాద్‌లో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్‌లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, హైదరాబాద్‌లో వ్యూహాత్మకంగా ఏ ఎస్ రావు నగర్, సికింద్రాబాద్ మరియు సోమాజిగూడలో తమ 3వ మరియు 4వ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను వైభవంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కిస్నా కు ఇవి 37వ & 38వ షోరూమ్‌లను సూచిస్తాయి. ఈ ప్రారంభోత్సవంలో హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఎం డి శ్రీ ఘనశ్యామ్ ధోలాకియా మరియు కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ డైరెక్టర్ శ్రీ పరాగ్ షా పాల్గొన్నారు.

ఈ వైభవోపేత ప్రారంభోత్సవం పురస్కరించుకుని, కిస్నా తమ విలువైన కస్టమర్లకు వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 100% వరకు తగ్గింపు మరియు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 20% వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ లకు ఉత్సాహాన్ని జోడిస్తూ, కిస్నా అద్భుతమైన లక్కీ డ్రా ప్రచారాన్ని #అబ్కీ బార్ ఆప్ కే లియే షాప్ & విన్ ఏ కార్ పేరిట ప్రారంభించింది, ఈ ఆఫర్ తో 100+ కార్లు గెలుచుకునే అవకాశం అందిస్తుంది. వినియోగదారులు రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్/ప్లాటినం/సాలిటైర్ ఆభరణాల కొనుగోలు లేదా రూ. 50,000 విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం ద్వారా ఆఫర్ డ్రా లో పాల్గొనవచ్చు . అదృష్టవంతులను ఎంపిక చేసి కారును బహుమతిగా కిస్నా అందజేస్తుంది.

హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఎండి, ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ, ”వృద్ధికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న హైదరాబాద్‌లో మా కార్యకలాపాలను విస్తరించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ విస్తరణ ‘హర్ ఘర్ కిస్నా’ మా లక్ష్యంకు అనుగుణంగా ఉంది, ఇక్కడ మేము భారతదేశం యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల బ్రాండ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాము, ఇది ప్రతి మహిళ వజ్రాభరణాలను సొంతం చేసుకోవాలనే కలను నిజం చేస్తుంది. మా “షాప్ & విన్ ఎ కార్” ప్రచారంతో, వినియోగదారులకు సరికొత్త కారును సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రతి కొనుగోలును మరింత ప్రత్యేకంగా చేయడానికి ఇది మాదైన మార్గం.’’ అని అన్నారు

కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ డైరెక్టర్ పరాగ్ షా మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌లోని మా వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి ఎ.ఎస్.రావు నగర్ మరియు సోమాజిగూడ స్టోర్స్ ను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశాము. ఈ షోరూమ్‌లు కస్టమర్ యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తాయి, మా ప్రీమియం ఆభరణాలు మరిన్ని కుటుంబాలకు అందుబాటులో ఉండేలా చూస్తాయి. మేము వృద్ధిని కొనసాగిస్తున్నందున, ప్రతి కస్టమర్‌కు నాణ్యత మరియు నమ్మకాన్ని అందించడంపై మా దృష్టి ఉంటుంది, కిస్నా నైతికతను ప్రతిబింబించే ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందించనున్నాము” అని అన్నారు.

కమ్యూనిటీకి తిరిగి ఇవ్వాలనే కిస్నా యొక్క నిబద్ధతకు అనుగుణంగా, కిస్నా ప్రారంభోత్సవ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించింది. అదనంగా, కిస్నా బీద వర్గాల ప్రజల కోసం ఆహార పంపిణీ డ్రైవ్‌ను కూడా నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News