తిరువనంతపురం : పక్కింట్లో ఉండే వ్యక్తి తన భార్యకు వాట్సప్ ముద్దు ఎమోజీ పంపించాడని సతీమణి, ప్రియుడిని కొడవలితో నరికి చంపాడు. ఈ సంఘటన కేరళ రాష్ట్రం పథనందిట్ట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కలంజూరులో బైజు(33), వైష్ణవి(28) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు ఇద్దరు కుమారులు ఉన్నారు. బైజు ఇంటి పక్కన విష్ణు(30) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి వైష్ణవికి విష్ణు ముద్దు ఎమోజీని పంపాడు. భర్త గమనించి వైష్ణవి మందలించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది.
ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో కొడవలితో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ఇంట్లో నుంచి తప్పించుకొని పక్కింట్లో ఉన్న విష్ణు దగ్గరికి వెళ్లింది. భార్యను బయటకు లాక్కొంచి కొడవలితో బైజు ఆమెను నరికి చంపాడు. అనంతరం విష్ణు అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతడిపై కొడవలితో దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి బైజు సమాచారం ఇచ్చారు. వెంటనే స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.