Friday, November 15, 2024

చరిత్ర సృష్టించిన కివీస్ స్పిన్నర్ పటేల్..

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ యూనిస్ పటేల్ తన కెరీర్‌లో అత్యంత అరుదైన రికార్డును సాధించాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఎజా జ్ టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు మాత్రమే ఇచ్చి పది వికెట్లను పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఎజాజ్ నిలిచాడు. ఇంతకుముందు ఇద్దరు మాత్రమే ఇలాంటీ ఫీట్‌ను సాధించా డు. ఇంగ్లండ్ అలనాటి స్పిన్నర్ జిమ్‌లేకర్ 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్‌కు చెందిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో పది వికెట్లను పడగొట్టి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఎజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లను పడగొట్టి వీరి సరసన నిలిచాడు. జిమ్ లేకర్ తర్వాతా దాదాపు 43 ఏళ్లకు అనిల్ కుంబ్లే ఈ రికార్డును తిరగరాశాడు. ఆ తర్వాత మరో 22 ఏళ్లకు కివీస్ స్టార్ ఎజాజ్ ఈ రికార్డును అందుకున్నాడు. ఇక పది వికెట్లు పడగొట్టిన వారు ముగ్గురు స్పిన్నర్లే కావడం మరో విశేషం.
పుట్టింది ముంబైలోనే..
ఎజాజ్ పటేల్ 1988 అక్టోబర్ 21న భారత్‌లోని ముంబైలో జన్మించాడు. ఎజాజ్ చిన్నతనంలోనే అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లిపోయింది. ఇక ఎజాజ్ అక్కడే క్రికెట్ ఆడాడు. 2012లో న్యూజిలాండ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. దాదా పు ఆరేళ్ల తర్వాత అతనికి కివీస్ టెస్టు, ట్వంటీ20 జట్టులో చోటు దక్కింది. 30 ఏళ్ల వయసులో అతనికి టెస్టు జట్టులో స్థానం లభించింది. ఇప్పటి వరకు కెరీర్‌లో 11 టెస్టులు ఆడిన ఎజాజ్ 39 వికెట్లు పడగొట్టాడు. తాజాగా భారత్‌పై పది వికెట్లు పడగొట్టి సరికొత్త స్టార్‌గా ఎదిగాడు. మరోవైపు కివీస్‌కు ఏడు టి20ల్లో ప్రాతినిథ్యం వహించి 11 వికెట్లను తీశాడు.
ప్రశంసల వెల్లువ..
పది వికెట్లతో చరిత్ర సృష్టించిన ఎజాజ్ పటేల్‌పై ప్ర పంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సో షల్ మీడియా వేదికగా పలువురు క్రికెట్ దిగ్గజాలు పటేల్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భా రత దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా పటేల్‌ను అ భినందించాడు. ఎజాజ్ ఇలాంటి అరుదైన రి కార్డును సాధించడం తనను ఎంతో ఆనం దం కలిగించిందన్నాడు. ఇక భారత మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటు మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, వసీం జాఫర్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్ తదితరులు పటేల్‌ను ప్రశంసించారు. అంతేగాక విదేశీ క్రికెటర్లు అరోన్ ఫించ్, ముస్తాక్ అహ్మద్, సక్లయిన్ ముస్తాక్, వసీం అక్రమ్, షెన్‌వార్న్ తదితరులు కూడా పటేల్‌ను అభినందించారు.

Kiwis Spinner Ajaz takes 10 wickets in 2nd Test

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News