Thursday, January 23, 2025

6 వికెట్లు కోల్పోయిన కివీస్.. 141/6

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో కివీస్ తడబడుతోంది. భారత్ బౌలర్లధాటికి కివీస్ విలవిలలాడుతోంది. 30 ఓవర్లకే 06 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సిరాజ్ బౌలింగ్‌లో డేవాన్ కాన్వే 10(16 బంతులు, 2 ఫోర్లు) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

దీంతో 28 పరుగుల వద్ద కివీస్ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. శార్దుల్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ 40 (39 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 70 పరుగుల వద్ద కివీస్ జట్టు రెండో వికెట్‌ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 15.3 ఓవర్ కు హెన్రీ నికోల్స్ 18 క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కుల్దీప్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఎల్బీగా వెనుదిరిగాడు. గ్రెన్ ఫిలిప్స్ షమీ వేసిన 24.3 ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యడు. సిరాజ్ బౌలింగ్ లో టామ్ లాథమ్ ఔటయ్యాడు. 31 ఓవర్లకు కివీస్ స్కోర్ 141/6. ప్రస్తుతం క్రీజులో బ్రాస్ వెల్ 19, శాంటర్న్ 03 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News