సౌతాంప్టన్: ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. భారత్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు ముందు లభించిన ఈ గెలుపు కివీస్‌లో కొత్త జోష్‌ను నింపిందనడంలో సందేహం లేదు. కీలక ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథి, శాంట్నర్ తదితరులు లేకున్నా ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించడం కివీస్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశమే. ఇక భారత్‌తో జరిగే పోరులో సమరోత్సాహంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం తోడ్పడుతుందనే చెప్పాలి. మరోవైపు భారత్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే నేరుగా ఫైనల్లో బరిలోకి దిగాల్సి వస్తోంది. న్యూజిలాండ్ మాత్రం ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి తగినంత ప్రాక్టీస్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇలాంటి స్థితిలో భారత్‌తో పోల్చితే కివీస్ కాస్త మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. అంతేగాక టిమ్ సౌథి, వాగ్నర్, బౌల్ట్, హెన్రీ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఇక డెవొన్ కాన్వే, విల్ యంగ్, టెలర్, హెన్రీ నికోల్స్, విలియమ్సన్, లాథమ్, టామ్ బ్లుండెల్ తదితరులతో బ్యాటింగ్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది.
అంతేగాక ఇంగ్లండ్ వాతావరణానికి కివీస్ ఆటగాళ్లు ఇప్పటికే అలవాటు పడడం కూడా వారికి పెద్ద సానుకూల అంశమే. దీనికి తోడు ఇంగ్లండ్‌పై సాధించిన సిరీస్ విజయం వారిని మరింత పటిష్టస్థితికి చేర్చింది. దీంతో భారత్‌తో జరిగే డబ్లూటిసి ఫైనల్లో న్యూజిలాండ్ సమరోత్సాహంతో బరిలోకి దిగుతుందనే చెప్పాలి. ఇక భారత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కోహ్లి, శుభ్‌మన్ గిల్, రహానె, పుజారా, రోహిత్, రిషబ్, జడేజా, అశ్విన్ తదితరులతో టీమిండియా బ్యాటింగ్ ఎంతో బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, షమీ, ఇషాంత్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఉమేశ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య జరిగే ఫైనల్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.
Kiwis won test series in England after 22 years