Thursday, January 23, 2025

అటార్నీ జనరల్‌గా మళ్లీ కెకె వేణుగోపాల్?

- Advertisement -
- Advertisement -

అటార్నీ జనరల్‌గా మళ్లీ కెకె వేణుగోపాల్?
జూన్ 30న ముగియనున్న పదవీకాలం

న్యూఢిల్లీ: భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్‌కు మరోసారి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆయన పదవీ కాలం పొడిగింపుపై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. వేణుగోపాల్ ప్రస్తుత ఏడాది పదవీ కాలం జూన్ 30న ముగియనున్నది. సాధారణంగా అటార్నీ జనరల్ పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. కాగా..అటార్నీ జనరల్‌గా మొదటిసారి నియమితులైనపుడు వేణుగోపాల్ పదవీకాలం 2020లో ముగిసింది. తన వయసును దృష్టిలో ఉంచుకుని తనకు మరో ఏడాది పాటు పదవీకాలం ఇవ్వాలని ఆయన కోరగా అది 2021లో ముగిసింది. ప్రస్తుతం వేణుగోపాల్ వయస్సు 91 సంవత్సరాలు. తిరిగి గత ఏడాది మరో ఏడాది పాటు ఆయన పదవీకాలం కొనసాగి ఈ జూన్‌తో ముగియనున్నది. అయితే సుప్రీంకోర్టులో ఆయన వాదిస్తున్న ప్రతిష్టాకరమైన కేసులను, న్యాయవాదిగా ఆయన అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్‌ను కేంద్రం పునర్నియమించే అవకాశం ఉంది.

KK Venugopal likely to Continue as Attorney General

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News