Thursday, January 23, 2025

కెకెఎం ఫౌండేషన్ చైర్‌పర్సన్ జయలక్ష్మీకి డాక్టర్‌రేట్

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: కెకెఎం ఫౌండేషన్ చైర్‌పర్సన్ మేడికొండ జయలక్ష్మీకి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా చికాగో యూఏస్‌ఏ వారిచే గౌరవ డాక్టర్ రేట్‌ను అందుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన జయలక్ష్మీ గత కొంత కాలంగా కెకెఎం ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు అనాథలకు వృద్ధ్దులకు అనేక సేవలను అందించారు. ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న జయ లక్ష్మీ సేవలను గుర్తించిన హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా చికాగో యూఏస్‌ఏ వారి డాక్టర్ రేట్ ను ప్రదానం చేశారు.

ఈ సందర్బంగా జయలక్ష్మీ మాట్లాడుతూ కెకెఎం ఫౌండేషన్ ద్వారా అనేక మంది దివ్యాంగులకు, అనాథలకు, వృద్ధ్దులకు తమ వంతు సేవలను అందించి అదుకుంటున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా చికాగో యూఏస్‌ఏ తమను గుర్తించి డాక్టర్ రేట్ ప్రధానం చేయడం చాల సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో తమ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News