- Advertisement -
హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా కెకెఆర్‌పై ముంబయి ఇండియన్స్ గెలిచింది. ముంబయి ఇండియన్స్ మొదటి రెండు మ్యాచ్ లలో ఓటమిని చవిచూసి అనంతరం మూడో మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించింది. రోహిత్ శర్మ మాత్రం మూడు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్ డకౌట్ రూపంలో వెనుదిరగగా రెండో మ్యాచ్‌లో నాలుగు బంతులో 8 పరుగులు చేయగా మూడో మ్యాచ్‌లో 12 బంతుల్లో 13 పరుగులు చేసి నిరాశపపరిచాడు. ఓ అభిమాని రోహిత్ శర్మ పేరుతో బ్లూ కలర్ వేసుకొని మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చాడు. రోహిత్ శర్మ ఔట్ కాగానే అభిమాని చాలా బాధను వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న కెకెఆర్ అభిమాని రోహిత్ అభిమానిని ర్యాగింగ్ చేశాడు. రోహిత్ ఔట్ కాగానే అతడిని చూస్తూ పగలబడి నవ్వాడు. అనంతరం టీజింగ్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -