- Advertisement -
రానున్న ఐపిఎల్ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కెకెఆర్) కెప్టెన్‌గా స్టార్ ఆటగాడు అజింక్య రహానె ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ యాజమాన్యం సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రహానెకు ఉన్న అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించినట్టు ఆ ప్రకటనలో యాజమాన్యం పేర్కొంది. గతంలో కూడా రహానె వివిధ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. మెగా వేలం పాటలో భారీ మొత్తాన్ని వెచ్చించి వెంకటేష్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్టే అతనికి కీలకమైన వైస్ కెప్టెన్సీని అప్పగించారు. కాగా, ఈ సీజన్‌లో కోల్‌కతా టీమ్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. సోమవారం కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
- Advertisement -