Monday, January 20, 2025

సమరోత్సాహంతో కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

నేడు గుజరాత్ పోరు
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్17లో అసాధారణ ఆటతో పెను ప్రకంపనలు సృష్టించి ఇప్పటికే నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అగ్రస్థానాన్ని కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన గుజరాత్ కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కోల్‌కతా ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకోగా గుజరాత్‌కు నాకౌట్ ఛాన్స్‌లు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి రేసులో నిలువాలని భావిస్తోంది. సిఎస్‌కెతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్‌లు శతకాలతో చెలరేగారు.

సుదర్శన్, గిల్‌లు ఫామ్‌లో ఉండడం గుజరాత్‌కు అతి పెట్ట ఊరటగా చెప్పొచ్చు. సిఎస్‌కె మ్యాచ్‌లో సాయి, గిల్‌లు విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచారు. చెలరేగి ఆడిన సుదర్శన్ 7 భారీ సిక్సర్లు, ఐదు బౌండరీలతో 51 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. గిల్ 55 బంతుల్లో 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా వీరిద్దరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.అంతేగాక డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, మాథ్యూవేడ్, రషీద్ ఖాన్ తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, మొహిత్ శర్మ, కార్తీక్ త్యాగిలతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న గుజరాత్‌కు సొంత గడ్డపై పోరు జరుగుతుండడం మరింత కలిసొచ్చే అంశంగా చెప్పాలి.

జోరుమీదుంది..

మరోవైపు కోల్‌కతా కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. 12 మ్యాచుల్లో ఏకంగా 9 విజయాలు సాధించి అ గ్రస్థానంలో నిలిచింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక గుజరాత్‌తో జరిగే మ్యాచ్ లో నైట్‌రైడర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. సాల్ట్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, అయ్యర్, నితీష్ రాణా, రసెల్, రింకు సింగ్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతాకే గెలుపు అవకాశాలు అధింకగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News