Monday, December 23, 2024

నేడు కోల్‌కతాతో లక్నో ఢీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం కీలక పోరు జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ప్రస్తుతం ఇరు జట్లు మూడేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థితిలో నిలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇంతకుముందు జరిగిన మ్యాచుల్లో చెన్నై చేతిలో కోల్‌కతా, ఢిల్లీ చేతిలో లక్నోలు పరాజయం పాలయ్యాయి. ఇలాంటి స్థితిలో రెండు జట్లు కూడా ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ఇటు కోల్‌కతా, అటు లక్నో టీమ్‌లోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. డికాక్, కెఎల్ రాహుల్, దేవ్‌దుత్ పడిక్కల్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, దీపక్ హుడా, ఆయూష్ బడోని, అర్షద్ ఖాన్ తదితరులతో లక్నో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అయితే పడిక్కల్, హుడా, పూరన్, కృనాల్ తదితరులు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా కీలక ఆటగాళ్లు తమ తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే లక్నోకు భారీ స్కోరు సాధ్యమవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో లక్నో ఆశలన్నీ ఓపెనర్లు డికాక్, రాహుల్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. వీరు శుభారంభం అందిస్తే మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతోంది. అప్పుడూ వీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాట్‌ను ఝులిపించే ఛాన్స్ ఉంటుంది. బౌలింగ్‌లో లక్నో బలంగానే ఉంది. అర్షద్ ఖాన్, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, స్టోయినిస్, కృనాల్ తదితరులతో బౌలింగ్ విభాగం సమతూకంగా కనిపిస్తోంది.
ఫేవరెట్‌గా కెకెఆర్..

మరోవైపు ఆతిథ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ (కెకెఆర్) ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. అయితే చెన్నైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. కానీ ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని నైట్‌రైడర్స్ తహతహలాడుతోంది. సాల్ట్, నరైన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ బలంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News