- Advertisement -
KKR vs LSG: ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై లఖ్‌నవూ సూపర్ గెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. చివరిలో ఓవర్ లొ 24 పరుగులు అవసరం కాగా.. కెకెఆర్ 19 పరుగుల మాత్రమే చేయగలిగింది. దీంతో కోల్ కతాపై లక్నో నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన 238 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(81), నికోలస్ పూరన్(87) భారీ అర్ధ శతకాలతో మెరుపులు మెరిపించారు. ఐడెన్ మార్కమ్(47) కూడా రాణించాడు. దీంతో లక్నో, కోల్ కతాకు 239 పరుగుల భారీ టార్గెట్ విధించింది.
- Advertisement -