నేడు ముంబైతో పోరు
ముంబై: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నైట్‌రైడర్స్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.
ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్‌లు జోరుమీదున్నారు. రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రసెల్, రమణ్‌దీప్‌లతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక వరుణ్, రసెల్, స్టార్క్, హర్షిత్ రాణా, నరైన్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఆతిథ్య ముంబైకి ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై కనీసం ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. అయితే బలమైన కోల్‌కతాతో పోరు ముంబైకి సవాల్ వంటిదేనని చెప్పాలి.