Sunday, November 24, 2024

బెంగళూరుకు చావోరేవో

- Advertisement -
- Advertisement -

నేడు కోల్‌కతాతో కీలక పోరు
కోల్‌కతా: వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే పోరు చావోరేవోగా మారిం ది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఆరింటిలో పరాజయం చవిచూసింది. దీంతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక నాకౌ ట్ రేసులో నిలువాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. మ రోవైపు కోల్‌కతా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో జయభేరి మోగించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగ పరుచుకోవాలని భావిస్తోం ది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే బౌ లర్లు, బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. సునీల్ నరైన్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్నాడు. రాజస్థాన్తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సెంచరీతో అలరించాడు. బంతితోనూ సత్తా చాటాడు. అయితే జోస్ బట్లర్ అజేయ శతకం సాధించడంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ సంచలన విజయం సాధించిన సంగతి తె లిసిందే. కాగా, బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ఎ లాగైనా గెలవాలనే లక్షంతో కోల్‌కతా పోరుకు సిద్ధమైంది.

సాల్ట్, నరైన్, శ్రేయస్ అయ్యర్, రఘువంశీ, రసెల్, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్, రమణ్‌దీప్ తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. నరైన్ ఫామ్‌లో ఉండడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. బౌలింగ్‌లోనూ నైట్‌రైడర్స్ బాగానే కనిపిస్తోంది. స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, వైభవ్, నరైన్ వంటి స్టార్ బౌలర్లు జట్టులో ఉన్నారు. ఇక సొంత మైదానంలో పోరుకు కోల్‌కతా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సవాల్ వంటిదే..

ఇక బెంగళూరుకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. వరుస ఓటములు జట్టు ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఆరు మ్యాచుల్లో ఓడడంతో ప్లేఆఫ్ అవకాశాలకు దాదాపు తెరపడినట్టే చెప్పాలి. అయి తే సాంకేతికంగా మాత్రం బెంగళూరు రేసులో కొనసాగుతుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది అంతుబట్టకుండా మారింది. విరాట్ కోహ్లి, కెప్టెన్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్‌లు తప్ప మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

వీరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. బ్యా టింగ్, బౌలింగ్ విభాగాల్లో అంతంత మాత్రంగానే రాణిస్తున్న బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. కోల్‌కతా వం టి బలమైన జట్టుపై గెలవాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. ఇందులో బెంగళూరు ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News