నేడు రాజస్థాన్‌తో కోల్‌కతా ఢీ
గౌహతి: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గౌహతి వే దికగా జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతుం ది. ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మా రింది. రెండు జట్లు కూడా తమ తమ తొలి మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. బెంగళూరు చేతిలో కోల్‌కతా, హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ పరాజయం చవి చూ శాయి. ఈ నేపథ్యంలో గౌహతిలో జరిగే పోరు రెండు జట్లకు సవాల్‌గా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లు విఫలమయ్యా రు. ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో సఫలం కాలేదు. అయితే బ్యాటర్లు రాణించ డం రాజస్థాన్‌కు ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, హెట్‌మెయిర్, దూబే తదితరులు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.
చెలరేగి ఆడిన సంజు శాంసన్ 37 బంతుల్లోనే 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 4 సిక్సర్లు, ఏడు బౌండరీలు బాదాడు. జురేల్ కూడా చెలరేగి ఆడాడు. హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జురేల్ 35 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. ఆరు సిక్స్‌లు, ఐదు ఫోర్లు కొట్టాడు. శుభమ్ దూబె కూడా 11 బంతుల్లోనే అజేయంగా 34 పరుగులు సాధించాడు. హెట్‌మెయిర్ కూడా (42) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా డు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రి యాన్ పరాగ్, నితీశ్ రాణా తదితరులు విఫలం కా వడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ మ్యా చ్‌లో వీరు కూడా రాణిస్తే రాజస్థాన్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. అయితే తొలి మ్యాచ్‌లో ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్ భారీగా పరుగులు సమర్పించు కోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఆ మ్యాచ్‌లో జోఫ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో ఏ బౌలర్ కూడా4 ఓవర్లలో ఇన్ని పరుగులు ఇవ్వలేదు.
బోణీ కోసం..
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది. బెంగళూరు చేతిలో ఓటమి పాలు కావడంతో జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. అయితే రాజస్థాన్‌పై గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోల్‌కతా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యా టర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. డికాక్, నరైన్, కెప్టెన్ అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, అంగ్‌క్రిష రఘువం zశీ, రసెల్, రింకూ సింగ్ వంటి విధ్వంసక బ్యాట ర్లు జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో నరైన్, రహానె మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. డికాక్ కూడా మెరుగై న ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. రింకూ చెలరే గి తే రాజస్థాన్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవ చ్చు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.