Monday, January 20, 2025

కోల్‌కతా లక్ష్యం 114

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌటైంది. కోల్‌కతా జట్టు ముందు 114 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఉంచింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు అభిషేక్ శర్మ(02), ట్రావిస్ హెడ్(0), రాహుల్ త్రిపాఠి(9) విఫలం కావడంతో ఆ జట్టు తక్కువ స్కోరు నమోదు చేసింది. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్కడి నుంచి ఏ బ్యాట్స్‌మెను మెరుగైన పరుగులు చేయకపోవడంతో తక్కువ స్కోరు చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు ప్యాట్ కమ్నీస్(24), ఎయిడెన్ మర్‌క్రమ్(20), హెన్రీచ్ క్లాసెన్(16), నితీశ్ రెడ్డి(13), , సాబాజ్ అహ్మద్(8), రాహుల్ త్రిపాఠి(9), అబ్దుల్ షామాద్(04), జయదేవ్ ఉనద్కత్(4), భువనేశ్వర్ కుమార్ (0 నాటౌట్) పరుగులు చేసి ఔటయ్యారు. కోల్‌కతా బౌలర్లలో అండ్రూ రస్సెల్ మూడు వికెట్లు, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా చెరో రెండో వికెట్లు తీయగా సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News