ఢిల్లీపై రికార్డు విజయం
విశాఖపట్నం: ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. బుధవారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 106 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇదే సమయంలో ఐపిఎల్‌లో రెండో అత్యధిక స్కోరును సాధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ 39 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మరో 7 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. యువ ఆటగాడు అన్గ్‌క్రిష్ 27 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 54 పరుగులు సాధించాడు. రసెల్ 3 సిక్సర్లు, 4 బౌండరీలతో 41 పరుగులు చేశాడు. రింకు సింగ్ 8 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. వైభవ్ అరోరా, వరుణ్ మూడేసి వికెట్లను పడగొట్టారు.
అదరగొట్టిన కోల్‌కతా
- Advertisement -
- Advertisement -
- Advertisement -