Saturday, April 5, 2025

కోల్‌కతా సూపర్ విక్టరీ

- Advertisement -
- Advertisement -

లక్నో : ఐపిఎల్‌లో కోల్‌కతా మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లక్నో సూపర్ జియాంట్స్ జరిగిన మ్యాచ్ లో 98 పరుగుల తేడాతో గెలుపొందింది. 236 పరుగుల భారీ లక్ష ఛేదనకు దిగిన లక్నో జట్టును కోల్‌కతా బౌలర్లు 137 పరుగులకే కట్టడి చేశారు. లక్నో బ్యాటర్లలో కెఎల్ రాహుల్(25), మార్కస్ స్టోయినిస్(36) తప్ప మరెవరూ రాణించపోవడంతో ఈ ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు పడగొట్టి లక్నో ఓటమిని శాసించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా బ్యాటర్లలో సునీల్ నరైన్(81) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు సాల్ట్(32), రఘువంశీ(32)లు బ్యాట్ ఝలిపించడంతో నర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News