- Advertisement -
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమితో చెన్నై సతమతమవుతోంది. ధోనీ సారథ్యంలో బరిలోకి దిగుతున్న చెన్నై.. ఈ మ్యాచ్‌లో విజయంతో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఇక ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో విజయం సాధించిన కోల్‌కతాకి కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టులో ఒక మార్పు చేసింది. స్పెన్సర్ స్థానంలో మొయిన్ అలీని జట్టులోకి తీసుకుంది. ఇక చెన్నై జట్టులో రెండు మార్పులు చేసింది. రుతురాజ్ స్థానంలో త్రిపాఠి, ముకేశ్ స్థానంలో అన్షుల్ కంభోజ్‌లు జట్టులోకి వచ్చారు.
- Advertisement -