Friday, April 11, 2025

ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా KKR..

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్‌ 2025లో మరో మ్యాచ్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టును కెకెఆర్ చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలోనే కోల్ కతా అరుదైన ఘనత సాధించింది. మూడు వేర్వేరు జట్లపై 20కిపైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పై 21 విజయాలు, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 20 విజయాలు, ఎస్ఆర్ హెచ్ పై 20 విజయాలు సాధించింది.

కాగా, నిన్న ఈడెన్ గార్డెన్ వేదికగా హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచులో కేకేఆర్ 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్ ఛేదనలో తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది. దీంతో 16.4 ఓవర్లలోనే కేవలం 120 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News