కోలొంబొ: భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 2వేల పరుగుల క్లబ్ లో చేరాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరిన మూడో భారత క్రికెట్‌గా రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ రికార్డును రాహుల్ సమం చేశాడు. రాహుల్, కోహ్లీ ఇద్దరూ 53వ ఇన్నింగ్స్‌లో 2,000 రన్స్ చేశారు. కోలంబో వేదికగా ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌కు ముందు రాహుల్ 2వేలకు 14 పరుగుల దూరంలో ఉన్నాడు.
శుభ్‌మన్ గిల్ ఔటయ్యాక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 18 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా వ్యవహారించిన రాహుల్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. ఇటీవల కోలుకున్న రాహుల్ ఈమధ్యే ఫిట్‌నెస్ సాధించాడు. ఆసియా కప్‌లో నేపాల్, పాక్ మ్యాచ్‌లకు దూరమైన రాహుల్.. శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు.