Sunday, April 13, 2025

హాట్ టాపిక్‌గా కెఎల్ రాహుల్ సెలబ్రేషన్స్ !

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రత్యర్థి ఎవరైనా.. సరే పట్టుంచుకోకుండా దుమ్ముదులిపేస్తోంది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ ఈ సారి ట్రఫీని ముద్దాడాలని భావిస్తోంది.

అయితే జట్టు విజయంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తండ్రి అయిన కారణంగా మొదటి మ్యాచ్‌కి దూరమైన రాహుల్ ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 183 పరుగులు చేశాడు. ఇక గురువారం బెంగళూరుపై తన సొంత మైదానం చిన్నస్వామిలో చెలరేగిపోయాడు. 7 ఫోర్లు, 6 సిక్సులతో 53 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. ఇక జట్టు విజయం తర్వాత రాహుల్ సెలబ్రేషన్స్ గురించి ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.

బ్యాట్‌ని నెలపై గుండ్రంగా తిప్పి.. ఇది తన మైదానంగా రాహుల్ సైగ చేశాడు. ఇప్పుడు ఈ సెలబ్రేషన్‌కి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్లు సెలబ్రేషన్ కాస్త ఓవర్‌ అయిందని కామెంట్ చేస్తున్నారు. కానీ.. కొందరు మాత్రం రాహుల్‌ చేసిన సెలబ్రేషన్ అదిరిపోయిందని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News