Friday, December 20, 2024

టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ…. సర్ఫరాజ్ ఖాన్ కు పిలుపు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓటమి చెందిన భారత జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తొడ కండరాల గాయంతో రెండో టెస్టుకు అందుబాటులో ఉండడంలేదు. కెఎల్ రాహుల్ కూడా కుడి తొడ నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. దీంతో రాహుల్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. గత ఐపిఎల్‌లో ఆడుతున్నప్పుడు రాహుల్ కుడి తొడకు గాయమైంది. శస్త్రచికిత్స చేయడంతో నాలుగు నెలలకు ఆటకు దూరమయ్యాడు.

రవీంద్ర జడేజా రాహుల్ కూడా రెండో టెస్టు అందుబాటులో లేకపోవడంతో ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఎడమ చేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్, అల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టెస్టు జట్టులోకి తీసుకోనున్నారు. దేశ వాలీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ జట్టులోకి రావడంతో క్రికెట్ పండితులు ప్రశంసిస్తున్నారు. తుది జట్టులో అతడికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 15 మంది సభ్యుల జట్టులో పటీదార్ ఉండడంతో సర్ఫరాజ్ ఖాన్ ఆడించే అవకాశం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News