Monday, December 23, 2024

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. రాహుల్ ఔట్‌పై వివాదం!

- Advertisement -
- Advertisement -

పెర్త్: ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన బోర్డర్‌గవాస్కర్ తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కెఎల్ రాహుల్ ఔట్‌పై వివాదం నెలకొంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కాస్త కుదురుగా ఆడాడు. అంత సాఫీగా సాగుతున్న సమయంలో రాహుల్ (26)ను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.

ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రాహుల్ ఔట్ కాలేదని, అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల్లే అతను వెనుదిరగాల్సి వచ్చిందని భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. అయితే అంపైర్ నిర్ణయం వల్ల నిరాశతో పెవిలియన్ చేరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News