Sunday, December 22, 2024

కెఎల్ రాహుల్ వస్తున్నాడు… ఆ బ్యాటర్ పై వేటు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది. ఫిబ్రవరి 23 నుంచి రాంఛీలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ భావిస్తోంది. రాంఛీ టెస్టుకు ముఖేష్ కుమార్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి టెస్టు ఆడిన తరువాత కెఎల్ రాహుల్ గాయపడడంతో వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులకు అతడు దూరంగా ఉన్నాడు. అతడు ఫిట్‌నెస్ సాధించడంతో నాలుగో టెస్టులో మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో వైజాగ్ టెస్టులో రజత్ పాటిదర్ మొదటి ఇన్నింగ్స్ 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్ తొమ్మిది పరుగులు, రాజ్‌కోట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులు, రెండో ఇన్నింగ్స్ డకౌట్ కావడంతో అతడి స్థానానికి ఎసరు వచ్చింది. రాహుల్ నాలుగో టెస్టులోకి వస్తే మాత్రం రజత్‌పై వేటు పడుతుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్, జురైల్ ధృవాల స్థానాలకు డోకా లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News