మన తెలంగాణ/క్రీడా విభాగం: పాకిస్థాన్ ఆ తిథ్యం ఇచ్చిన ఐసిసి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి భారత్ ట్రోఫీని దక్కించుకుంది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన రోహిత్ సేన తన ఖా తాలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను జత చేసుకుంది. టీమిండియా విజయంలో ఓ క్రికెటర్ ముఖ్య భూమిక పోషించాడు. తనదైన శైలీలో ఆడుతూ జట్టు ఛాంపియన్‌గా నిలువడంలో తనవంతు సహకారం అందించాడు. అ తనే టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్ రా హుల్.
ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ అసాధారణ ఆటతో అలరించాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్‌కు దిగుతూ జట్టును విజయపథంలో నడిపించాడు. వికెట్ కీపర్‌గా తన బా ధ్యతను సక్రమంగా నిర్వర్తించిన రాహుల్ బ్యా టర్‌గాను సత్తా చాటాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ ట్రోఫీ సాధించడంలో రాహుల్ కూ డా కీలకమని చెప్పాలి. జట్టు ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి నిలకడైన బ్యాటింగ్‌తో అలరించా డు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆడుతూ భారత్‌కు పలు మ్యాచుల్లో విజయాలు సాధించి పెట్టాడు. రాహుల్ ప్రతిభను ఎంత పొగిడినా తక్కువేనని చెప్పాలి.
దక్కని గుర్తింపు..
టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న రా హుల్‌కు తగినంత గుర్తింపు లభించడం లేదనే చెప్పాలి. శుభ్‌మన్ గిల్, రోహిత్, కోహ్లి, శ్రే యస్ అయ్యర్, షమి తదితరులకు లభించిన గుర్తింపు రాహుల్‌కు దక్కలేదనడం లో ఎలాంటి సం దే హం లేదు. వికెట్ కీపర్‌గా సక్రమ ంగా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. అయినా అతని ప్రతిభను జట్టు యాజమాన్యం గుర్తించలేదని చెప్పొచ్చు. ఇతర ఆటగాళ్లపై ప్ర శంసలు కురిపించే మీడియా సయితం రాహుల్‌పై చిన్న చూపు చూస్తుంది. అతని ప్రతిభకు తగినంత గుర్తింపు మీడియాలో రావడం లేదు.
ఇటీవలే నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కపిల్ దేవ్, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సయితం రాహుల్‌పై బిసిసిఐ చిన్నచూపు చూస్తుందని వి మర్శలు గుప్పించారు. వారు చెప్పింది వంద శాతం నిజమని చెప్పక తప్పదు. జట్టులోని ఇ తర ఆటగాళ్లకు లభించే గుర్తింపు రాహుల్‌కు దక్కడం లేదు. కెప్టెన్‌తో సహా ప్రధాన కోచ్ స యితం అతన్ని పట్టించుకున్న దాఖలలు లేవు. ఎవరూ పట్టించుకున్నా పట్టించుకోకున్నా రా హుల్ మాత్రం తన బాధ్యతను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. పలు మ్యాచుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టి సరికొత్త హీరోగా అవతరించాడు. కనీసం రా నున్న రోజుల్లోనైనా రాహుల్ ప్రతిభకు తగినం త గుర్తింపు దక్కాలని ఆశిద్ధాం.