Monday, December 23, 2024

ఒకటి ఊహిస్తే మరొకటి జరిగింది: రాహుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు, అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయడంతో సఫారీలు 116 పరుగులు చేసి ఆలౌటయ్యారు. దీంతో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలో ఛేదించింది. ఈ సందర్భంగా కెఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడారు. పింక్ వన్డేలో టీమిండియా విజయం సాధించడం సంతోషంగా ఉందని కెఎల్ రాహుల్ తెలిపాడు. గత పర్యటనలో తన కెప్టెన్సీలో మూడు వన్డేలలో ఓడిపోయామని, ఇప్పుడు మాత్రం పిచ్ తాము ఊహించిన దాని కంటే పూర్తి భిన్నంగా ఉందని చెప్పారు. మొదటి స్పినర్లతో బౌలింగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నామని, పేస్‌కు అనుకూలించడంతో సరైన స్థానంలో బౌలింగ్ చేశామని రాహుల్ ప్రశంసించారు. పింక్ వన్డేలో విజయ సాధించడంతో తొలి భారత్ కెప్టెన్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు సఫారీ ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలతో బరిలోకి దిగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News