Friday, December 20, 2024

బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ.. టీమిండియాకు స్వల్ప ఊరట

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతున్న టీమిండియాకు స్వల్ప ఊరట లభించింది. ఈ సిరీస్ నేపథ్యంలో ఇండియా ఏ జట్టుతో జరుగుతున్న ఇంట్రా స్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ గాయపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మోచేతికి బంతి బలంగా తాకడంతో ఆయన నొప్పితో మైదానం వీడారు. దీంతో పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రాహుల్ అనుమానమేనన్న వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా అతను కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాహుల్ తిరిగి ప్రాక్టీస్ చేయడంతో అంతా సర్దుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, పెర్త్‌లో ఇంట్రా స్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల శుభ్‌మన్ గాయానికి గురైనట్టు తెలిసింది. ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ వేలికి గాయమైనట్టు తెలిసింది. గాయం తీవ్రతను మెడికల్ పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఇప్పటి వరకు గిల్ గాయంపై బిసిసిఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News