Tuesday, December 3, 2024

గాయంతో రాహుల్ ఔట్..

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. గాయం వల్ల ఇప్పటికే కీలక బౌలర్లు మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్‌లు సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు. తాజాగా స్టార్ ఆటగాడు లోకేశ్ రాహుల్ కూడా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సందర్భంగా రాహుల్ గాయపడ్డాడు. అతనికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ అందుబాటులో లేకుండా పోయాడు. కాగా, ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో కూడా రాహుల్ పెవిలియన్‌కే పరిమితయ్యాడు. అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, కీలకమైన మూడో టెస్టులో విహారి బదులు అతన్ని ఆడించే అవకాశాలు మెరుగ్గా కనిపించాయి. కానీ గాయం బారిన పడడంతో రాహుల్‌కు నిరాశే మిగిలింది. త్వరలోనే రాహుల్ స్వదేశానికి వెళ్లి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రాహుల్ గాయపడిన విషయాన్ని జట్టు యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

KL Rahul rolled out from Australia Tour

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News